కీలక బిల్లులను గవర్నర్లు పెండింగులో పెట్టారంటూ కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసులో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. 8 నెలలుగా కేరళ, పశ్చిమబెంగాల్ గవర్నర్లు కీలక బిల్లులను పరిష్కరించలేదంటూ ఆ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌పై వెంటనే వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రపతికి పంపాల్సిన బిల్లులను పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం రెండు రాష్ట్ర గవర్నర్ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. గతంలో తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు కూడా గవర్నర్ కార్యాలయాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.