హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళ కేసులో దోషి అనారోగ్యంతో చనిపోయాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బూల్‌కు దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుళ్ళ కేసులతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మక్బూల్ ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆరు నెలల కిందట అతడిపై హైదరాబాద్‌లో మరో కేసు కూడా నమోదైంది.
దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21 రాత్రి ఏడు గంటల సమయంలో ఉగ్రవాదులు ఐఈడీలు పేల్చారు. దీంతో 18 మంది మృతిచెందారు. దిల్సుఖ్నగర్ పరిధిలోని 107 బస్‌స్టాప్ వద్ద ఐఈడీ పేలిన ఆరు సెకెన్లకు ఏ1 మిర్చీ సెంటర్ వద్ద మరో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 126 మంది గాయపడగా, వీరిలో 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి.