ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 49 అడుగులకు చేరడంతో అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన అతిభారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణా నదులకు భారీ వరద చేరింది. ఆల్మట్టి నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరదను జూరాలకు విడుదల చేశారు. అక్కడ నుంచి వరద శ్రీశైలం (srisailam dam ) చేరుతోంది. మరోవైపు తుంగభద్ర డ్యాం నిండిపోవడంతో 74 వేల క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు విడుదల చేశారు. మొత్తం 2.74 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. మరో నాలుగు రోజుల్లో శ్రీశైలం డ్యాం మొత్తం నిండనుందని ఇంజనీర్లు అంచనా వేశారు. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు.
వరద కొనసాగితే రెండు వారాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీ వరద చేరే అవకాశముంది.నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 504 అడుగుల నీరుంది. 122 టీఎంసీలకు సమానం మరో 190 టీఎంసీలు చేరితే నాగార్జునసాగర్ నిండనుందని అధికారులు తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు