ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో నిన్న బుధవారం నాడు ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. గణేశ్‌పూర్ అటవీప్రాంతం దగ్గర లభించిన శవం గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమెను నలుగురు ముస్లిం వ్యక్తులు అపహరించి, ఈ ఘాతుకానికి ఒడిగట్టారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ కేసులో నిందితులు హసీన్, షారుఖ్, ఇక్రముద్దీన్, మొహిసిన్ అని గుర్తించారు.
ఇది సామూహిక అత్యాచారం, హత్య కేసు అని పోలీసులు ధ్రువీకరించారు. అమ్మాయి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారనీ చెప్పారు. ‘‘వారం రోజుల నుంచీ బాలిక కనిపించడం లేదు. మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తుపట్టారు. వారు నలుగురు వ్యక్తులను అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకున్నాం. ఇంటరాగేషన్ జరుగుతోంది. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించాం’’ అని పోలీసుల ప్రకటన వివరించింది.
బాలికను నిందితులు ఎత్తుకుపోయారు. వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగంలోకి ఇనప రాడ్డు గుచ్చి హత్య చేసారు. బాలిక శవాన్ని గుర్తుపట్టకుండా చేయడం కోసం ఆమె ముఖంపై ఆసిడ్ పోసి తగులబెట్టేసారు.
బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. జులై 21న బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్ళారు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు హసీన్ ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా ఎత్తుకుపోయాడు. జులై 22న తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోలీసులు జులై 24న ఒక మృతదేహాన్ని వారికి చూపించారు. అది తమ కుమార్తె శరీరమేనని వారు గుర్తు పట్టారు. హసీన్, షారుఖ్, ఇక్రముద్దీన్, మొహిసిన్లే తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు చెప్పారు.
పోలీసులు ప్రధాన నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ జరుగుతోంది. అయితే ఈ కేసులో పోలీసులు ఇంకా ఫిర్యాదు రిజిస్టర్ చేయలేదు.