ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావానికి తోడు, రుతుపవనాలు చురుగ్గామారడంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఇప్పటికే గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 14 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి కూడా వరద పోటెత్తుతోంది. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.