సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గనులు, ఖనిజాల తవ్వకాలపై కేంద్రానికి గుత్తాపత్యం లేదని తేల్చి చెప్పింది. ఖనిజాలపై రాష్ట్రాలు రాయల్టీ విధించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 9 మంది సభ్యుల ధర్మాసనంలో 8 మంది ఒకే విధమైన తీర్పు వెలువరించారు. రాయల్టీ, టాక్స్ ఒకటి కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీం తీర్పులో ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు మేలు జరగనుంది.
గనులపై కేంద్రానికి పార్లమెంటు సర్వహక్కులు కల్పించలేదని డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయడింది. గనులు, ఖనిజాలపై పార్లమెంటుకు సర్వాధికారాలున్నాయని హరీష్ సాల్వే వాదనలు సుప్రీంకోర్టు కొట్టివేసింది. గనుల నిర్వహణ, అభివృద్ధి, పన్నులు వేయడంలో రాష్ట్రాలకు కూడా అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.