అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. వీరబల్లె మండలం షికారిపాలెం గ్రామంలో ఓ వివాహితను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. కొందరు మహిళలు కర్రలు, కోడిగుడ్లతో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.
షికారిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల రెండో వివాహం చేసుకుని ఊరికి చేరుకుంది. ఆమెను గమనించిన కాలనీ వాసులు చెట్టుకు కట్టేసి కొట్టారని పోలీసులు తెలిపారు. విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం పోలీసులకు చేరడంతో వెంటనే ఆమెను విడిపించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. మహిళపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.