బంగ్లాదేశ్ అల్లర్ల బాధితులు పశ్చిమ బెంగాల్ రావచ్చంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మమతా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా మండిపడింది. ఆమె వ్యాఖ్యలు ఉగ్రవాదులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ బంగ్లాదేశ్ దుయ్యబట్టింది. ఇప్పటికే మమత వ్యాఖ్యలను ఖండించిన బంగ్లాదేశ్, మరోసారి ఆమె వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది.
బంగ్లాదేశ్లో గత రెండు వారాలుగా రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ హింసలో వంద మందికిపైగా చనిపోయారు. యూనివర్శిటీల్లో మొదలైన హింస దేశ వ్యాప్తం కావడంతో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలుస్తోంది.