తిరుపతిలో ఘోరం జరిగింది. అప్పటిదాకా అన్నతో కలసి మద్యం సేవించిన తమ్ముడే కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే… తిరుపతి పద్మావతి నగర్లో టీపీదాస్ కుటుంబం ఉంటోంది. తమ్ముడు మోహన్ కూడా అన్నతో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి మద్యం సేవించారు. దాస్‌కు ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడు. ఆ వెంటనే మోహన్ కత్తితో దాస్ భార్య సునీత వారి ఇద్దరి బాలికలు నీరజ, దేవశ్రీలను కత్తితో పొడిచి చంపేశాడు. తరవాత గడియపెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
బయటకు వెళ్లి వచ్చిన దాస్ తలుపులు కొట్టినా తీయకపోవడంతో పొరుగువారి సాయంతో బద్దలు కొట్టారు. అందరూ రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. మోహన్‌కు గతంలో రెండు వివాహాలు జరిగినా వారితో విడాకులు కావడంతో, అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.