ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, సీఆర్డీయే ప్రాంతాన్ని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై లోక్సభలో ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు. గతంతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు పెంచామన్నారు. 2023-24 ఏడాదికి ఏపీకి రూ. 8,406 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
విజయవాడ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో అందజేస్తామన్నారు.