Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

‘నివాళి కుడ్యా’న్ని ‘భారతదేశపు త్యాగభూమి’గా గుర్తించాలి: మోహన్ భాగవత్

Phaneendra by Phaneendra
Jul 24, 2024, 04:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘స్వాతంత్ర్యం మా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాం’ అని ప్రకటించి, భారతదేశాన్ని బ్రిటిష్ కబంధహస్తాల నుంచి విడిపించడమే లక్ష్యంగా దేశంలోని నలుమూలలనుంచీ పోరాడిన వీరుల ధైర్యసాహసాలకు, వారి మహోన్నత స్ఫూర్తికి నివాళిగా కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రలో ‘నివాళి కుడ్యం’ (ట్రిబ్యూట్ వాల్) ఆవిష్కరణ జరిగింది. జులై 23, మంగళవారం జరిగిన ఆ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు.

భరతమాత స్వేచ్ఛాస్వతంత్రాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన 1040మంది జాతీయవీరుల పేర్లను నివాళి కుడ్యం మీద చెక్కారు. వివేకానంద కేంద్ర అధ్యక్షుడు ఎ బాలకృష్ణన్ సమక్షంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆ కుడ్యాన్ని ఆవిష్కరించారు. ‘ట్రిబ్యూట్ వాల్’ అనే ఆలోచన చక్ర విజన్ ఇండియా ఫౌండేషన్ ఛైర్మన్ చక్ర రాజశేఖర్‌ది కాగా, ఆ సంస్థ ఉపాధ్యక్షుడు పి గోవర్ధనన్ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు.

ఆ సందర్భంగా ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, ‘‘భారతీయులమైన మనందరికీ ఈ దేశం వేలయేళ్ళనుంచీ కొనసాగుతోందని తెలుసు. చైనా కంటె మన దేశం ప్రాచీనమైనది. గ్రీస్, ఈజిప్ట్‌ లాంటి ఎన్నో దేశాలు పుట్టాయి, గిట్టాయి. వాటన్నిటికంటె ముందునుంచీ ఉన్న భారతదేశం నేటికీ కొనసాగుతూనే ఉంది. భారతదేశం అనే ఈ అస్తిత్వం అంత సులువుగా రాలేదు, దాన్ని నిర్మించడానికి ఎన్నో తరాలు పట్టింది. దీన్ని రక్షించడానికి మన పూర్వీకులు లెక్కలేనన్ని త్యాగాలు చేసారు. ఎన్నో విదేశీ చొరబాట్లను, మన దేశాన్ని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలనూ తట్టుకుని నిలబడగలిగాం’’ అని చెప్పారు.

‘‘సుదీర్ఘకాలం దాడులు చేసినప్పటికీ చొరబాటుదారులు మనలను తుడిచిపెట్టేయలేకపోయారు. మనం మళ్ళీ లేచి నిలబడగలిగాం, స్వతంత్రం సాధించగలిగాం. మన పూర్వీకుల గొప్ప త్యాగాలు చేసి మన ఉనికిని రక్షించారు. మనం ఇటీవలే స్వాతంత్ర్య దినపు 75వ వార్షికోత్సవం జరుపుకున్నాం. అఖండ భారతదేశపు ప్రతీ జిల్లాలోనూ ప్రతీ పది గ్రామాల్లో కనీసం ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నారని తెలుసుకున్నాం. వారందరూ మన మాతృభూమి కోసం ప్రాణాలు త్యజించారు. వారి పోరాటాలు, త్యాగాలూ మనకు స్ఫూర్తి. ఆ స్వాతంత్ర్య సమరవీరులను వారివారి స్వస్థలాల్లో ఇప్పటికీ గుర్తుంచుకున్నారు, గౌరవించుకుంటున్నారు. అన్ని సామాజికవర్గాలూ, అన్ని భాషలూ, అన్ని ధర్మాలూ, అన్ని మతాల్లోనూ స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు. వారే మనకు స్ఫూర్తిప్రదాతలు. వారి ప్రేరణతో మనను మనం మరింత మెరుగుపరచుకోవాలి, భారతదేశాన్ని ‘విశ్వగురువు’గా నిర్మించుకోవాలి’’ అంటూ భాగవత్ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సందేశాన్ని పంపించారు. ‘‘నివాళి కుడ్యం అన్న ఆలోచన ప్రపంచంలోనే అద్వితీయమైనది. చక్ర విజన్ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం యువతరానికి కచ్చితంగా స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ కార్యక్రమం నా మనసుకు ఎంతో దగ్గరైనది. మిషన్ ఆజాదీ 2027లో భాగమైనందుకు గర్వంగా ఉంది’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ ‘ట్రిబ్యూట్ వాల్’ను నిర్మించేందుకు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయవీరుల జన్మస్థలాల నుంచి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఉపయోగించడం విశేషం. ఇస్రో మాజీ ఛైర్మన్ కె శివన్, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె అన్నామలై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: Freedom FightersKanyakumariMohan BhagwatNarendra ModiRSS ChiefSLIDERTOP NEWSTribute WallVivekananda Kendra
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.