నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విమానంలోని 19 మందిలో 18 మంది చనిపోయారు.
ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడగా అతడిని కాఠ్ మాండూలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినదని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. కొన్నేళ్ళ కిందట త్రిభువన్ ఎయిర్‌పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ కు చెందిన ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు