పంజాబ్లోని అమృత్సర్లో ఆవులను చంపి గోమాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు క్రైస్తవులను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచీ పెద్దమొత్తంలో గోమాంసాన్ని జప్తు చేసారు.
పంజాబ్ పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు జులై 21 ఆదివారం నాడు ఒక ఇంటిపై దాడి చేసారు. ఆవులను నరికి చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న నిషాన్ మాసీ, అజయ్ మాసీ, సామ్యుయెల్ మాసీ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు.
ఆ సంఘటన అమృత్సర్ గ్రామీణ ప్రాంతంలోని దయాళ్ భట్టి గ్రామంలో చోటు చేసుకుంది. రాందాస్ పోలీస్ స్టేషన్ సబ్ఇనస్పెక్టర్ నరేష్ కుమార్ బృందం సుమారు 160 కేజీల గోమాంసాన్ని జప్తు చేసింది. ముగ్గురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసారు.
పంజాబ్లో గోమాంసం విక్రయాలపై 1955 నుంచీ నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ నిందితులు దయాళ్భట్టీ, పరిసర ప్రాంతాల్లో చాలాకాలంగా బీఫ్ విక్రయిస్తున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.