నేపాల్ లో ఘోరం జరిగింది. కాఠ్‌మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో టేకాఫ్ సమయంలో విమానం అదుపుతప్పింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై నుంచి క్రాష్ అయింది. దాంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను ఘటనాస్థలి నుంచి వెలికి తీశారు.
విమానంలో విమానయాన సంస్థకు చెందిన 19 మంది సాంకేతిక సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణికులు ఎవరూ లేరని విమానాశ్రయ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. ఘటనా స్థలంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు సహాయ సిబ్బంది శ్రమిస్తున్నారు.