కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం వస్తున్న సందేహాలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నివృత్తి చేశారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం కూడా ఉందని గుర్తు చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుతం అందజేసిన సాయం రూ. రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఋణంగా తీసుకుంటున్నామని తెలిపారు. దానికి తదనంతర నిధుల కేటాయింపు కూడా ఉంటుందన్నారు. ఋణం చెల్లింపులు ఎలా జరగాలన్నది ది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా, వాళ్ల వాటాను చెల్లించగలరా? లేదా? తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర వాటాను కూడా కేంద్రమే గ్రాంట్ ఇవ్వడంపై చర్చించిన తర్వాత వెల్లడిస్తామన్నారు.
ఇప్పటికే ఏపీకి రాజధాని లేకుండా పదేళ్ళు గడిచిపోయాయన్న కేంద్రమంత్రి, భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే, దానికి రాజధాని ఉండలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోవడానికి కారకులు ఎవరు అనే జోలికి పోదలచుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రసాయంపై కూడా నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు.