గోదావరిలో వరదనీటి ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగడంతో కొత్తగా వరద నీరు పెద్దగా రావడం లేదు. అయినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భద్రాచలం దగ్గర ఈ ఉదయం కూడా 47.3 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఇన్ఫ్లో 14.56 లక్షల క్యూసెక్కులు ఉండగా, మొత్తం ఆ నీటినంతటినీ ఔట్ఫ్లోలో వదిలేస్తున్నారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది.
వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నదిలో ఇంకా వరదనీరు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరించారు. వరద సహాయక చర్యల కోసం 4 ఎన్డిఆర్ఎఫ్, 7 ఎస్డిఆర్ఎఫ్… మొత్తం 11 బృందాలను మోహరించారు.
గోదావరి వరదతో కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో వరదనీరు చేరింది. కోనసీమలో లంకప్రాంతాలు నీట మునిగాయి. కాజ్వేలు సైతం నీటిలో మునిగిపోయాయి. గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయల్లో వరదజోరు ఎక్కువగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు