జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆ ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.
భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి పక్కా సమాచారం అందగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కుప్వారా పోలీసులతో పాటు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.