ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, పూర్తి స్థాయి బడ్జెట్ రెండు నెలల తరవాత ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. గడచిన ఐదేళ్లలో చేసిన అప్పుల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని చెప్పారు.
రాష్ట్ర అప్పులు 13 లక్షల కోట్లకు చేరడంతో ప్రతి నెలా 8 వేల కోట్లు అప్పులు తెస్తేనే గడిచే పరిస్థితి నెలకొందని చంద్రబాబునాయుడు వెల్లడించారు. అప్పులు వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, రాష్ట్ర ఆదాయం అన్నీ అంచనా వేసేందుకు 2 నెలల సమయం పడుతుందన్నారు. ప్రస్తుత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు.