నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఎనిమిది రోజుల కిందట విజయవాడ మధురానగర్ వద్ద రమణారావు ఏలూరు కాలువలో దూకినట్లు పోలీసులు అనుమానించారు. ఆయన ఫోన్ సిగ్నల్స్ అక్కడే చివరి సారి కట్ కావడంతో కాలువలో దూకి ఉంటాడని గాలింపు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. వారం రోజుల పాటు గాలించినా ఫలితం దక్కలేదు. ఏలూరు కాలువలో నీటిని తగ్గించి గాలింపు చేపట్టారు. వెంకటరమణారావు మృతదేహాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు మదురానగర్ రైల్వే వంతెన వద్ద గుర్తించారు.
నరసాపురం ఎంపీడీవోగా చేసిన సమయంలో ఫంటు కాంట్రాక్టరు నుంచి ప్రభుత్వానికి చేరాల్సిన నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. వెంకటరమణారావు బ్యాంకు స్టేట్మెంట్లను కూడా పోలీసుల తనిఖీ చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు వెంకట రమణారావు చేసిన బ్యాంకు లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు.