కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించారు. వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3 నుంచి 7 లక్షల ఆదాయం ఉన్నవారిపై 5 శాతం పన్ను విధించారు. రిటర్న్సులు సమర్పించిన వారికి రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక రూ. 7 నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఉన్న వారు 10 శాతం, 10 లక్షల నుంచి 12 లక్షల ఆదాయం ఉన్న వారు 15 శాతం, 12 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం ఉన్న వారిపై 20 శాతం, 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 30 శాతం టాక్స్ విధించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 నుంచి 75 వేలకు పెంచారు.
క్యాన్సర్ మందులు, మొబైల్స్‌పై పన్నులను కేంద్రం భారీగా తగ్గించింది. బంగారం, వెండి, తోలు వస్తువుల దిగుమతిపై కస్టమ్స్ సుంకాలు తగ్గించారు. దీంతో వీటి ధరలు కొంత మేర దిగిరానున్నాయి. గోల్డ్, సిల్వర్‌పై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం తగ్గించారు. బంగారం స్మగ్లింగ్ నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.