భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అత్యున్నత గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ‘ఒలింపిక్ ఆర్డర్’ అవార్డు ప్రకటించింది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అగస్ట్ 10న ప్యారిస్‌లో జరిగే 142వ ఐవోసీ సెషన్లో ఈ అవార్డును అందుకోనున్నాడు.
ఒలింపిక్ ఉద్యమానికి అభినవ్ బింద్రా గొప్ప సేవలందించాడని కొనియాడిన మంత్రి మన్సుఖ్ మాండవీయ, కొన్ని తరాల పాటు షూటర్ కు అతడు స్ఫూర్తిగా నిలుస్తాడని ప్రశంసించారు.
ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయుడుగా అభినవ్ బింద్రా రికార్డు సృష్టించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ ఘనత సాధించి భారత్ కు పేరు తెచ్చాడు. 2006లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో స్వర్ణం, 2002, 2006, 2010 కామన్వెల్త్ గేమ్స్ లో పెయిర్ ఈవెంట్లో పలు బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. 2014లో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం అందుకున్నాడు
ఆసియా క్రీడల్లోనూ పలు పతకాలు సాధించి అరుదైన ఘతన సొంతం చేసుకున్నాడు.