గుజరాత్ కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి భార్య తప్పుదారి పట్టింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరారైంది. ఏడాది కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఐఏఎస్ అధికారి రణ్‌జీత్ కుమార్‌తో ఆమెకు సంబంధాలు తెగిపోయాయి. అయితే ఇటీవల రణ్‌జీత్ కుమార్ భార్య సూర్యజైకు విడాకులు ఇవ్వడం కోసం కోర్టులో పిటిషన్ వేశారు.
భర్త విడాకుల విషయం తెలుసుకున్న సూర్య జై తమిళనాడు నుంచి గాంధీనగర్‌లోని ఐఏఎస్ అధికారి బంగ్లాకు చేరiకుంది. ఆమెను ఇంట్లోకి రానీయవద్దని సెక్యూటీని ఆదేశించి రణ్‌జీత్ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ తరవాత ఇంట్లోకి బలవంతంగా వచ్చిన సూర్య జై పడక గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.ఇది గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.భార్య శవాన్ని తీసుకునేందుకు కూడా ఐఏఎస్ అధికారి ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు.
ఇటీవల గ్యాంగ్‌స్టర్‌తో కలసి సూర్య జై ఓ 11 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసుల చొరవతో బాలుడిని విడిపించారు. అప్పటి నుంచి గ్యాంగ్ స్టర్, సూర్య జైకోసం తమిళనాడు పోలీసులు వెతుకుతున్నారు.