వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన, నీట్ యూజీ 2024 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ మొదలైంది. మే 4వ తేదీకి ముందే నీట్ పేపర్ లీకైందా అంటూ.. విచారణ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై. చంద్రశూడ్ న్యాయవాదిని ప్రశ్నించారు. నీట్ పేపర్లు బిహార్‌లోని కొన్ని కేంద్రాలకు రిక్షాలో తరలించారని గుర్తించారు. ఇప్పటికీ ఈ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నీట్ పేపర్ కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో లీక్ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దేశ వ్యాప్తంగా హైకోర్టుల్లో దాఖలైన 40 పిటిషన్లకు కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది.
బిహార్ పోలీసుల నివేదికల ప్రకారం బ్యాంకు వాలెట్లకు పేపర్లు చేరకముందే లీకైందని తెలుస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 161 వాంగ్మూలాలు మే 4వ తేదీకి ముందే పేపర్ లీకైందని చెబుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రశూడ్ పేర్కొన్నారు.