కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణలోని జూరాలకు లక్షా 25 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండిపోవడంతో వచ్చిన వరదను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కులు, 17 గేట్లు ఎత్తివేయడం ద్వారా లక్ష క్యూసెక్కులకుపైగా వరదను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు లక్షా 25 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 844 అడుగులకు చేరుకుంది. 48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 212 టీఎంసీలుగా ఉంది.
తుంగభద్రకు వరద పోటెత్తుతోంది. లక్షా 17 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం 105 టీఎంసీలు కాగా, ఇప్పటికే 84 టీఎంసీల నీరు చేరింది. ఏ క్షణం అయినా ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు ఇంజనీర్లు సిద్దం అవుతున్నారు. ఇవాళ సాయంత్రానికి తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరే అవకాశముంది. మరో వారంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఆ తరవాత నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు