ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి సారిగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో లక్షా ఏడు వేల క్యూసెక్కులు జూరాలకు వదిలారు. జూరాల ప్రాజెక్టు నిండిపోవడంతో అక్కడి నుంచి లక్షా 75 వేల క్యూసెక్కుల వరద జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. జూరాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తితోపాటు, 17 గేట్లు ఎత్తివేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 42 టీఎంసీల జలాలున్నాయి. నీటి మట్టం 821 అడుగులకు చేరింది. తుంగభద్ర నుంచి రేపు సాయంత్రానికి వరద నీటిని విడుదల చేసే అవకాశముందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఆ వరద కూడా తోడైతే శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముంది. మరో వారంలో శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం నుంచి 9 టీఎంసీలు తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు