బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు తీవ్రస్థాయికి చేరడంతో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది.
ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పలువురు నిరసన తెలుపుతున్నారు. అల్లర్లలో114 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ ‘కనిపిస్తే కాల్చి వేత’ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధ కుటుంబాలకు కల్పించే రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కోటాను 30 నుంచి 5 శాతానికి తగ్గించాలని తీర్పు వెల్లడించింది. దేశంలో 93 శాతం ఉద్యోగ నియామకాలు ప్రతిభ ఆధారంగా చేపట్టాలని, మిగిలిన 2 శాతం దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, మైనారిటీలకు కేటాయించాలని తీర్పులో పేర్కొంది.