భారత్ విషయంలో పాకిస్తాన్ సైన్యం కుట్రలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి మరీ భారత్ లోకి పంపుతున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
పీవోకేలోని కోట్లీ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు భారత్ లో చొరబడ్డారు. పాక్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను సరిహద్దుల వద్దకు తీసుకువస్తున్న సైన్యం… వారికి నివాసాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు.
భారత ఆర్మీ , పాక్ సైన్యం కుట్రను నిర్ధారించింది. పాకిస్థానీ రేంజర్ల రక్షణలో సరిహద్దుల్లోంచి ఉగ్రవాదులు భారత్ లోకి అడుగుపెడతున్నారని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటి వరకు 50 నుంచి 55 వరకు మంది భారత్ లోకి వచ్చి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలు కురిసే ఈ సమయంలో భారత జవాన్లు విధులు నిర్వర్తించడం ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తారు.