నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో శనివారంనాడు నిఫా వైరస్ సోకిన 14 సంవత్సరాల బాలుడు కోజికోడ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిఫా వైరస్ టెస్ట్ చేయించేందుకు శాంపిల్స్ పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు కేరళ వైద్య మంత్రి జార్జి తెలిపారు. బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు నిర్థారించారు. మళప్పురంకు చెందిన బాలుడిని కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇవాళ ఉదయం బాలుడికి మూత్రం ఆగిపోయిందని, కాసేపటికే అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఆ వెంటనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వైద్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు.
నిఫా వైరస్ సోకిన బాలుడితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాలుడితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి, శాంపిల్స్ పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నారు. నిఫాతో చనిపోయిన బాలుడి మృతదేహానికి అంత్యక్రియల నిర్వహణపై ప్రభుత్వం తగిన జాగ్రత్తలు పాటిస్తున్నట్లు మంత్రి వీణాజార్జి వెల్లడించారు.