ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అవకతవకల్లో తిహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేసే కుట్ర చేస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ స్వీట్లు తింటున్నాడని మొదట చెప్పిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఆయన ఆహారం సరిగా తీసుకోవడ లేదంటూ చెప్పడంపై సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. జైల్లో కేజ్రీవాల్‌ను చంపే కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ జూలై 7న ఇన్సులిన్ కూడా తీసుకోలేదని జైలు అధికారులు తెలిపారు. ఇంటి నుంచి ఆహారం వస్తోన్నా, ఆయన సరిగా తీసుకోవడం లేదని జైలు అధికారులు చెబుతున్నారు. సరైన క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోకపోవడం వల్లే కేజ్రీవాల్ బరువు కోల్పోతున్నారని జైలు అధికారులు వెల్లడించారు.