ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఆలయాన్ని 2వేలకిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారి ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవి, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
అమ్మవారిని శాకాలతో అర్చించడంతో అతివృష్టి, అనావృష్టి నివారించబడి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పూర్వం హిరణ్యాక్షుడి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపోశక్తితో వేదాలను అంతర్ధానం చేస్తాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయి కరువుకాటకాలు వస్తాయి. అప్పుడు జనమంతా అమ్మవారిని వేడుకోగా ఆ తల్లి దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసినట్లు పురాణాల్లో వివరించారు.
ఇంద్రకీలాద్రి పై శాకంబరి మహోత్సవాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. శనివారం నాడు మూలవిరాట్‌తో పాటు మల్లికార్జున మహా మండపంలో ఉత్సవమూర్తి కామధేను అమ్మవారిని కూడా శాకంబరిగా అలంకరణ చేశారు. రాజగోపురం ప్రాంగణంలోని నవదుర్గల ప్రతిమలకు చేసిన అలంకరణ అద్భుతంగా ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు