దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహర్షి వేద వ్యాసుడు ఈ రోజునే జన్మించడంతో దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
హిందూ ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ముంది. గురువును కూడా దేవుడితో సమానంగా గౌరవించడం సంప్రదాయం. గురు పౌర్ణమి సందర్భంగా హరిద్వార్‌లో భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు. అయోధ్యలోగల సరయూ నది ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజలకు వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలనే వేద వ్యాసుడి ఉపదేశాన్ని గుర్తు చేశారు.
గురువుల పట్ల అత్యంత గౌరవం తో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.