ఆషాడ పౌర్ణమి పురష్కరించుకుని సింహాచలంలో శనివారం సాయంత్రం మొదలైన 32 కి.మీ గిరిప్రదక్షిణ పరిపూర్ణమైంది. లక్షలాది భక్తులు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మొదలైన గిరి ప్రదక్షిణ 32 కి.మీ సాగింది. ఆదివారం ఉదయానికి భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నారు. ప్రదక్షిణ అనంతరం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు.
తుది విడత చందన సమర్పణ స్వామి వారికి అర్చకులు నిర్వహించారు. 125 కిలోల చందనాన్ని స్వామి వారికి సమర్పించారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిప్రదక్షిణ చేయలేని వృద్ధులు, బాలింతలు, గర్భిణిలు సింహగిరిపై మూడు సార్లు ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కలు చెల్లించుకున్నారు. గిరి ప్రదక్షిణలో లక్ష మంది భక్తులు పాల్గొన్నారని అంచనా.