నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండం ప్రభావంతో కర్ణాటకలో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. దీంతో కృష్ణమ్మ వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ జలాశయం నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగా జూరాలకు నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 81,160 క్యూసెక్కులుగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కూడా వరద పోటెత్తుతోంది. 8 గేట్లు ఎత్తి, నీటిని సముద్రంలోకి వదిలారు.