మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారం అయిందని ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. పొరపాటున క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని గుర్తించారు. దాన్ని సరిచేయడంతో ప్రపంచ వ్యాప్తంగా విమానయానం, బ్యాంకింగ్, పౌర సేవల్లో తలెత్తిన ఇబ్బందులు తొలగిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వేలాది విమానాలను రద్దు చేశారు. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. టికెట్ బుకింగ్ వ్యవస్థ పనిచేయలేదు. దీంతో పలు దేశాల్లో దాదాపు 200 కోట్ల మంది ఇబ్బందులు పడినట్లు అంచనా.
దేశంలోనూ విమాన సేవలు యథావిధిగా నిర్వహిస్తున్నట్లు విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. మైక్రోసాఫ్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించడంతో విమాన సర్వీసులు యథావిధిగా జరుగుతున్నాయన్నారు. మైక్రోసాఫ్ విండోస్‌లో శుక్రవారం తలెత్తిన సమస్యను శనివారం నాటికి పరిష్కరించారు. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, బ్రిటన్ దేశాల్లో తలెత్తిన ఇబ్బందులు తొలగిపోయాయి.