ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి జీవో జారీ చేసింది. ఇప్పటికే బదిలీపై ఉండి పోస్టింగ్ దక్కని వారితోపాటు, మొత్తం ఒకేసారి 63 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. పోస్టింగ్ రాకుండా ఉన్న, చాలా మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్ దక్కింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్లు, కలెక్టర్లను బదిలీ చేశారు. కొందరికి ప్రాధాన్యత దక్కగా, వైసీపీతో అంటకాగిన వారిని అంతగా ప్రాధాన్యత లేని పదవులకు బదిలీ చేశారు.
కేరళల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మైలవరకు కృష్ణతేజను పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్‌గా నియమించారు. గృహ నిర్మాణ శాఖ ఎండీగా ఉన్న గిరీషాను, పౌరసరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా ఉన్నారు. వారికి పదవులు దక్కలేదు.