నకిలీ బంగారు కాయిన్స్ తయారు చేసి జనాలను బురిడీ కొట్టిస్తోన్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కేంద్రంగా నకిలీ గోల్డ్ కాయిన్స్ తయారు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతోన్న నలుగురు సభ్యుల ముఠాను షాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నలుగురు సభ్యుల ముఠా నుంచి 100 నకిలీ గోల్డ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.36 లక్షల నగదు వారి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకే బంగారం అంటూ ఇప్పటికే పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఎంత మందిని మోసం చేసిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.