నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. సీఎం చంద్రాబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, విద్యా మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ టీడీపీ బీసీ విభాగం నేత రాజు యాదవ్ కర్నూలులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజుయాదవ్ పిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకరంగా విమర్శలు చేసింది. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి ఎవరిపై అయితే విమర్శలు చేసిందో, వారిలో ఎవరూ కూడా ఫిర్యాదు ఇవ్వలేదు. టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ కర్నూలులో ఫిర్యాదు చేయడం, పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.