వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది.
పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలో అనేక ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.