కావడ్ యాత్రా మార్గంలో వ్యాపారులు తమ పేరును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ యూపీ ప్రభుత్వ ఆదేశాలపై నటుడు సోనూసూద్ ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యాపారుల చిరునామా బదులు, మానవత్వం అని బోర్డు పెట్టుకోవాలంటూ సూచించారు. సోనూ సూద్ వ్యాఖ్యలపై బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. హలాల్ స్థానంలో మానవత్వం అని రాయాలంటూ వ్యంగ్య విమర్శలు చేశారు.
కావడ్ యాత్రా మార్గంలో వ్యాపారాలు నిర్వహించే వారు, తప్పనిసరిగా వారి పేరుతో బోర్డు పెట్టాలంటూ గత వారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ ప్రభుత్వ నిర్ణయంపై రచయిత జావేద్ అక్తర్ చేసిన విమర్శలు తీవ్ర సంచలనంగా మారాయి. జర్మనీలో నాజీలు కేవలం గుర్తు మాత్రమే ఉపయోగించేవారని, యూపీ ప్రభుత్వం నేరుగా వ్యాపారుల పేర్లతో బోర్డులు పెట్టాలని సూచిస్తోందంటూ విమర్శలు చేశారు.