సినీనటుడు సోనూసూద్ వివాదాస్పద ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక ముస్లిం వ్యాపారి తన ధాబాలో తయారు చేస్తున్న రొట్టెల మీద ఉమ్మి వేస్తున్న వీడియోను సమర్ధించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ఆ ముస్లిం వ్యాపారిని రామాయణంలోని శబరిమాతతో పోల్చాడు. సోనూసూద్ పైత్యంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఒక ధాబాలో ఒక ముస్లిం వ్యాపారి రోటీలు చేస్తూ వాటి మీద ఉమ్మి వేస్తున్న వీడియో వైరల్ అయింది. దాన్ని సమర్ధిస్తూ సోనూసూద్ ఈ ఉదయం ట్వీట్ చేసాడు. ‘‘మన శ్రీరాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లను తినగా లేనిది, నేనెందుకు (ఉమ్మి ఊసిన రొట్టెలను) తినలేను? సోదరులారా, హింసను అహింసతో ఓడించవచ్చు. మానవత్వం నిలిచి ఉండాలంతే. జై శ్రీరామ్’’ అంటూ సోనూసూద్ తన ఎక్స్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసాడు.
అయితే సోనూసూద్ వ్యాఖ్యలపై నెటిజెన్లు మండిపడ్డారు. ముస్లిం వ్యాపారి తాను అమ్మే రోటీల మీద ఉమ్మి వేయడాన్ని, శబరిమాత రాముడికి తీయటి పండ్లు పెట్టడం కోసం కొరికిచూడడంతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శబరి రాముణ్ణి తన దైవంగా భావించి ఆయనకు రుచికరమైన పండ్లు ఇవ్వాలనే ప్రయత్నంలో ఎంగిలి చేసింది. ముస్లిం వ్యాపారి హిందూమతంపై ద్వేషంతో ఉమ్మివేసిన ఆహారాన్ని అంటగడుతున్నాడు. ఆ రెండింటినీ సమంగా ఎలా చూస్తావంటూ సోనూసూద్‌ను నిలదీస్తున్నారు.
ఒక ఎక్స్ యూజర్ సోనూసూద్‌ను ఆ ధాబాకు వెళ్ళి ఉమ్మివేసిన రోటీలు తింటూ వీడియో తీసి పెట్టమని కోరాడు.
అలాగే, ఆ విక్రేతను శబరితో పోలుస్తూ తనను తాను పరోక్షంగా శ్రీరాముడితో పోల్చుకోడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేసారు. రాజకీయ విశ్లేషకుడు అభిషేక్ తివారీ ‘‘ఆ రోటీల వ్యాపారి శబరీమాత కాదు, మీరు రాముడూ కాదు. శబరి ప్రేమకు చిహ్నం, ఆ వ్యక్తి ద్వేషంతో ఉమ్మివేస్తున్నాడు’’ అంటూ స్పందించారు.
మరో పాఠకుడు ‘‘నీ ఏకపక్ష లౌకికవాద భావజాలాన్ని నిరూపించుకోవడం కోసం శబరీమాత ప్రేమను థూక్ జిహాద్‌తో దరిద్రంగా పోల్చడం సిగ్గుచేటు. కావడ్ యాత్ర చేపట్టేవారు సాత్వికాహారం తీసుకుంటూ, ఎన్నోరోజుల పాటు దీక్షగా తపస్సు చేసుకుంటూ చేసే యాత్రపై నీకు గౌరవం లేదు. నీ వ్యవహారం చాలా అసహ్యకరంగా ఉంది’’ అంటూ స్పందించాడు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో జులై 22నుంచి కావడ్ యాత్ర అనే హిందూ ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతుంది. ఆ యాత్ర జరిగే మార్గంలోని హోటళ్ళు, ధాబాలు, ఇతరత్రా ఆహారపదార్ధాలు అమ్మే దుకాణాల యజమానుల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించింది. చాలామంది ముస్లిం వ్యాపారులు హిందూపేర్లతో తమ వ్యాపారాలు చేస్తూ ఆహారపదార్ధాలపై ఉమ్మివేయడం, హలాల్ చేసిన వస్తువులను హిందువులకు విక్రయించడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఘటనలు వీడియో సాక్ష్యాలతో సహా దొరికాయి. అటువంటి ఘటనలు పలు సందర్భాల్లో శాంతిభద్రతల సమస్యలుగా కూడా పరిణమించాయి. ఆ నేపథ్యంలో యూపీ సర్కారు ఆ నిర్ణయం తీసుకుంది.
దానికి స్పందించిన సోనూసూద్, ఆహారపదార్ధాలు విక్రయించే దుకాణాలు తమ ఉనికిని ‘మానవత్వం’ అని చూపించాలంటూ ట్వీట్ చేసాడు. దానికి జవాబుగా ఒక వ్యక్తి, కొందరు విక్రేతలు వినియోగదారుల ఆహారంలో ఉమ్మి ఊస్తున్నారని, అందువల్లే ప్రభుత్వం వారి పేర్లను ప్రదర్శించాలని అడిగిందనీ వివరిస్తూ ఒక ముస్లిం విక్రేత రోటీలపై ఉమ్మి ఊస్తున్న వీడియోను షేర్ చేసాడు. దానికి జవాబుగా సోనూసూద్ ఈ శబరిమాత పోలికతో తాజా వివాదానికి కారణమయ్యాడు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు