గోదావరికి వరద తాకిడి మరింత పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.5 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66, 900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలాడు. గోదావరి 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో 5 గేట్లను ఎత్తారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా, 1066 అడుగులకు చేరుకుంది.
కర్ణాటకలో కురుస్తున్న వానలకు కృష్ణానదికీ భారీగా వరద చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నారాయణపూర్ ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తడంతో జూరాలకు 67వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 316.880 అడుగులుకు చేరింది.
తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. తుంగ నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వానలు పడుతుండటంతో టీబీ డ్యాంలో వరద పొంగి ప్రవహిస్తోంది.