తెలంగాణలోని హాజీపూర్ వద్ద ఘోరం జరిగింది. కూలీ పనులు చేసుకుని బతికే ఇద్దరు మహిళలకు మద్యం పోసి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చంపేటకు చెందిన ఇద్దరు మహిళలు ప్రతి రోజూ కూలీ పనులకు వెళుతుంటారు. పని కోసం అచ్చంపేటలో అడ్డా వద్దకు వచ్చారు. ఇంట్లో పని చేయించుకుంటామంటూ
వినోద్ సింగ్, గజానంద సింగ్ వారిని పనికి తీసుకెళ్లారు. ఇంటిని శుభ్రం చేయించుకుని వారిని మాటల్లో పెట్టారు. సాయంత్రం 3 గంటల సమయంలో వారికి మద్యం పోశారు. వారికి మత్తెక్కిన తరవాత కారులో ఎక్కించుకుని హాజీపూర్ శివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయారు.
మత్తులో పడిపోయిన మహిళలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరా ఫుటేజీ, బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.