మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ ఆదేశాల మేరకు పూజా ఖేడ్కర్‌పై కేసు నమోదైంది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి యూపీఎస్సీని తప్పుదారి పట్టించిన విషయంలో కేసు నమోదు చేశారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి 2007లో దివ్యాంగురాలినంటూ నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. పోర్జరీ సంతకాలు, చిరునామాలు మార్చినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారం ఇచ్చి యూపీఎస్సీని కూడా తప్పుదారి పట్టించిందని నిర్ధారణకు వచ్చారు.
ఇప్పటికే ప్రొబెషనరీ నుంచి రిలీవ్ చేశారు. అకాడమీలో రిపోర్ట్ చేయాలని ముందుగా ఆదేశించారు. శుక్రవారం ఆమె సభ్యత్వం రద్దు చేశారు. భవిష్యత్తులో ఆమె యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఉండేందుకు నోటీసులు జారీ చేశారు. పూజా ఖేడ్కర్ ఇచ్చే సమాధానంపై ఆమెపై యూపీఎస్సీ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతోంది. పుణేలో ప్రొబెషరీ ఐఏఎస్‌గా ఉండగానే పూజా ఖేడ్కర్ నిబంధలకు తూట్లు పొడవడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఆమె తల్లి ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు.