ఢిల్లీ పోలీసులు కిడ్నీ రాకెట్‌ను చేధించారు. బంగ్లాదేశీయుల నుంచి కిడ్నీలను తీసి నొయిడాలోని ఓ ఆసుపత్రిలో రోగులకు అమర్చుతున్నారనే పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్,యూపీ రాష్ట్రాలకు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశీయుల నుంచి రూ.4 నుంచి రూ.6 లక్షలకు కిడ్నీ తీసుకుని, రోగుల వద్ద నుంచి రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
నొయిడాలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడికి సహకరించిన డాక్టర్ విజయకుమారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో కిడ్ని మార్పిడికి డాక్టర్ విజయ రూ.2 లక్షల తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఢిల్లీలోని జోసాల విహార్ ప్రాంతంలో కొందరు బంగ్లాదేశీయుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ కిడ్నీ రాకెట్‌ను చేధించారు. కొందరు బంగ్లాదేశీయులకు ఉద్యోగాలప్పిస్తామని కూడా కిడ్నీలు కాజేసినట్లు తెలుస్తోంది.