ఉత్తరప్రదేశ్‌లో జులై 22 నుంచి కావడ్ యాత్ర మొదలవుతోంది. ఆ సందర్భంగా ముజఫర్‌నగర్ జిల్లా యంత్రాంగం యాత్రకు ఐదు రోజుల ముందు అంటే జులై 17 నుంచి ఒక నిబంధన విధించింది. యాత్ర మార్గంలో ఆహారపదార్ధాలు అమ్మేవారు తమ పేర్లను దుకాణాలపై స్ఫుటంగా కనిపించేలా ప్రదర్శించాలి అన్నదే ఆ నిబంధన. యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అయోమయమూ కలగకుండా, ప్రజాజీవనానికి భంగం కలగజేసే ఎలాంటి అవాంతరాలూ తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి, కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక సున్నీ ముస్లిం మహిళ మాట్లాడిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆమె ‘‘సున్నీలు, బరేల్వీలు అయిన మేమే నిజమైన ముస్లిములం. ఇలాంటి పనులన్నీ షియాలు చేస్తారు. మీరు వారిని ఒక గ్లాసు నీళ్ళు అడిగితే, వాళ్ళు మీకు నీళ్ళు ఇచ్చేముందు అందులో ఊస్తారు. మేము అలాంటి పని చేయము. అందుకే యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం’’ అని స్పష్టంగా చెప్పింది.
ఆహార పదార్ధాలు, పండ్లు అమ్మేవారు వాటిపై ఉమ్ముతారా అని అడిగినప్పుడు షియా తెగకు చెందిన ముస్లిములు ఆ పని కచ్చితంగా చేస్తారని ఆమె తేల్చిచెప్పింది.
కావడ్ యాత్ర జరిగే మార్గంలోని హోటళ్ళు, ధాబాలు, తోపుడుబళ్ళపై వాటి యజమానులు లేదా నిర్వాహకుల పేర్లు స్పష్టంగా కనబడేలా కచ్చితంగా రాయాలని ముజఫర్‌నగర్ జిల్లా యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఆ ఉత్తర్వులు తమపట్ల వివక్ష కనబరుస్తున్నాయని ముస్లిములు విమర్శిస్తున్నారు. నిజానికి ఆ ఉత్తర్వుల్లో ముస్లిములు లేదా హైందవేతరులు మాత్రమే తమ పేర్లు వెల్లడించాలి అని లేదు, దుకాణదారులు అందరూ తమ పేర్లు ప్రకటించాల్సిందే అని మాత్రమే ఉంది.
కావడ్ యాత్రలో పాల్గొనేవారు ఎవరి దగ్గరనుంచైనా పండ్లు లేదా మరే ఇతర ఆహారపదార్ధాలు కొనుగోలు చేయవచ్చని, దానిపై ఎలాంటి ఆంక్షలూ లేవనీ ముజఫర్‌నగర్ ఎస్ఎస్‌పి స్పష్టంగా చెప్పారు. విక్రేత పేరు ప్రదర్శించాలన్న నియమం ఒక్క ముస్లిములకే కాదని, అందరికీ వర్తిస్తుందనీ చెప్పారు. ఆ విషయాన్ని తమ విమర్శకులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని వివరించారు.
సాధారణంగా ముస్లిములు నడిపే దుకాణాలకు హిందూ పేర్లు పెట్టడం చాలాచోట్ల జరుగుతూనే ఉంది. తద్వారా ఆ దుకాణాలు హిందువులవే అనే భ్రమ కలుగుతుంది. యుపిఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే విక్రేత అసలు పేరు తెలుస్తుంది. అందువల్ల, వినియోగదారులను, ప్రత్యేకించి కావడియాలను ఆకర్షించడానికి ముస్లింలు నిర్వహించే దుకాణాల విషయంలో ఆందోళన నెలకొంది.
దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో విక్రేతలు తాము విక్రయించే వస్తువుల మీద ఉమ్మి వేయడం, వాటిని నాకడం, కొన్నిసందర్భాల్లో మూత్రం విసర్జించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటువంటి చర్యలకు పాల్పడుతున్న విక్రేతలపై అపనమ్మకం, ఆగ్రహం కలుగుతున్నాయి.
అటువంటి చర్యలను నివారించడానికి, కావడ్ యాత్ర చేసే భక్తుల ధార్మిక విశ్వాసాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోడానికే యూపీ ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు విధించింది. దాన్ని సున్నీ తెగ ముస్లిములు కొందరు సమర్ధించడమూ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.