తండ్రీకూతుళ్ల బందంపై అసభ్యంగా వీడియోలు చేసి జైలు పాలైన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్స్ కేసు నమోదైంది. ప్రణీత్ గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే జైల్లో ఉన్న ప్రణీత్‌పై 67బి సెక్షన్, ఫోక్సో చట్టం, 79 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేశారు.
అసభ్య వీడియోలు చేసి రిమాండులో ఉన్న ప్రణీత్‌ను విచారణ నిమిత్తం మూడు రోజులు కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలు సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు గంజాయి, డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నాడని తేలడంతో మాదక ద్రవ్యాల వినియోగం కింద కూడా కేసు నమోదు చేశారు.