టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది. జూలై 22న నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి పరిమితం చేసింది.
ఆన్ లైన్ లో 500 టికెట్లు, ఆఫ్ లైన్ లో మరో 1,000 టికెట్లను చేయనున్నారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యంలో జారీ చేస్తారు.
మిగిలిన 100 టికెట్లు శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయం కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు.