తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజులు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశ ముందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలో ఇప్పటికే 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురేసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో గడచిన 24 గంటల్లో 11 సెం.మీ అత్యధిక వర్షపాత నమోదైందని ఐఎండీ తెలిపింది.