ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్లో ఓ ఎత్తైన భవనం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. డ్రోన్ల ద్వారా బాంబు దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాంబు దాడులు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు ప్రజలను హెచ్చరించాయి.
గత ఏడాది అక్టోబర్ 27న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై భీకరదాడులు చేసిన తరవాత మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 37 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించివేసే వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు పలుమార్లు హెచ్చరించారు. ఇటీవల పాలస్తీనాలోని రఫాలో దాడులు ముమ్మరం చేసింది. మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్బొల్లా ఉగ్రవాదులు, ఇరాన్ కూడా డ్రోన్ దాడికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలను ఇజ్రాయల్ అధికారులు వ్యక్తం చేశారు.