యూపీలోని గోండా జిల్లాలో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళుతోన్న రైలు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం గం.2.35 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద సమాచారం తెలియగానే యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ అధికారులను అప్రమత్తం చేశారు. 15 అంబులెన్సులో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. రైలు ప్రమాదంతో ఈ మార్గంలో 13 రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని రద్దు చేశారు. రైలు ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.